Ram: 'స్కంద' నుంచి తమన్ హుషారైన బీట్!

  • రామ్ హీరోగా రూపొందుతున్న 'స్కంద'
  • ఆయన జోడీకట్టిన శ్రీలీల
  • ప్రత్యేక ఆకర్షణగా తమన్ సంగీతం 
  • ఐదు భాషల్లో సెప్టెంబర్ 15న రిలీజ్ 
Skanda song promo released

రామ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ సినిమా షూటింగు చకచకా జరిగిపోతోంది. ఇటీవలే ఈ సినిమాకి 'స్కంద' అనే టైటిల్ ను ఖరారు చేశారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో, రామ్ జోడీగా శ్రీలీల అలరించనుంది.

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి 'నీ చుట్టూ చుట్టూ ..' అంటూ సాగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. కలర్ ఫుల్ గా వేసిన ఖరీదైన సెట్లో ఈ పాటను చిత్రీకరించారు. రామ్ ఎనర్జీకి తగినట్టుగా తమన్ కంపోజ్ చేసిన పాట ఇది అని అర్థమవుతోంది. యూత్ కి కనెక్ట్ అయ్యే మాదిరిగానే జోరుగా .. హుషారుగా ఈ బీట్ ఉంది. 

 పూర్తి పాటను ఈ నెల 3వ తేదీన ఉదయం 9:36 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు చెప్పారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ ... కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు. వరుస ఫ్లాపులతో ఉన్న రామ్ కి ఈ సినిమా హిట్ తెచ్చి పెడుతుందేమో చూడాలి.

More Telugu News