Medak District: వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడికి చిత్రహింసలు

medak Youth tortured over his affair with a married woman
  • మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఘటన
  • బాధితుడికి స్థానిక మహిళతో వివాహేతర సంబంధం
  • ఫలితంగా మహిళ అత్తింటిని వీడి పుట్టింటికి చేరుకున్న వైనం
  • దీనికి అతడే కారణమంటూ ఒంటిపై వాతలు పెట్టిన స్నేహితులు

మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమె అత్తింటిని వీడి పుట్టింటికి చేరేందుకు కారణమయ్యాడంటూ ఓ యువకుడిని కొందరు చిత్ర హింసలకు గురిచేశారు. వంటిపై వాతలు పెట్టారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన నారాయణ అలియాస్ కిట్టు తూప్రాన్‌కు చెందిన సాయి, జితేందర్, మరో వ్యక్తి స్నేహితులు. ఆదివారం రాత్రి ఈ ముగ్గురూ కలిసి కిట్టూను తూప్రాన్‌కు పిలిచారు. ఆ తరువాత అంతా కలిసి సాయి ఇంట్లో మద్యం తాగారు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో వారు కిట్టూను విద్యుత్ తీగలతో కట్టేసి మర్మాంగాలు, నాలుకతో పాటూ శరీరంపై పలు చోట్ల వాతలు పెట్టారు. 

బాధితుడు వారి నుంచి అతికష్టం మీద తప్పించుకుని హైవేపై ఉన్న ఓ దాబా వద్దకు చేరుకున్నాడు. ఈ విషయం కిట్టు కుటుంబసభ్యులకు తెలిసి వారు అక్కడికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఓ మహిళతో కిట్టూకు ఉన్న వివాహేతర సంబంధం కారణంగా ఆమె తన అత్తింటిని వీడి పుట్టింటికి చేరుకోవాల్సి వచ్చిందన్న కక్షతోనే నిందితులు ఈ దారుణానికి తెగబడ్డట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News