Nara Lokesh: ​ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముగిసిన లోకేశ్ పాదయాత్ర

  • నేడు దర్శి నియోజకవర్గంలో పాదయాత్ర
  • ముండ్లమూరులో సభ
  • ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 17 రోజుల పాటు సాగిన పాదయాత్ర
  • వినుకొండ నియోజకవర్గంలో ప్రవేశించిన యువగళం
Nara Lokesh Yuvagalam Padayatra ended in old Prakasam district

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకే చేపట్టిన యువగళం పాదయాత్ర 171వ రోజు దర్శి నియోజకవర్గంలో హోరెత్తింది. యువగళం రాకతో ముండ్లమూరు దద్దరిల్లింది. 

వేంపాడు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర ముండ్లమూరు, పసుపుగల్లు, ఉల్లగల్లు మీదుగా కెలంపల్లి విడిది కేంద్రానికి చేరుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యువనేత పాదయాత్ర మంగళవారం రాత్రితో ముగిసి వినుకొండలో ప్రవేశించనుంది. 

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 17 రోజులపాటు 220 కి.మీ. మేర యువగళం పాదయాత్ర కొనసాగింది. 

ముండ్లమూరు సభలో లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్...

జగన్ ఎలా పేదవాడు?

జగన్ కులం క్యాష్, జగన్ మతం క్యాష్. లక్ష కోట్లు ఆస్తి ఉన్నా, లక్ష రూపాయల చెప్పులు వేసుకొని తిరుగుతున్నా, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నా పేదవాడ్ని అంటూ అబద్ధం చెబుతాడు. 

బెంగుళూరు లో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు. సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టివి, ఛానల్ ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు.

మోటార్లకు మీటర్లు – రైతులకు ఉరితాళ్లు

జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ 2గా ఉంది.

రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టీడీపీ మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.

ఉద్యోగులకూ తప్పని వేధింపులు!

జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జీపీఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టీఏ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జీపీఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. 

పోలీసులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బు సైతం కొట్టేశాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది.

రూ.2 వేల కోట్లతో అభివృద్ధి చేశాం!

దర్శిని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీనే. రూ.2 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. గ్రామాల్లో సీసీ రోడ్లు, డబుల్ రోడ్లు, బ్రిడ్జ్ లు, పేదలకి ఇళ్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించింది టీడీపీనే. కురిచేడులో గురుకుల పాఠశాల, దర్శిలో పల్లె వనం పార్క్, పశువుల ఆసుపత్రి భవనం, ట్రెజరీ బిల్డింగ్ నిర్మించాం. ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసాం. 

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2264.9 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 14.9 కి.మీ.*

*172వరోజు (1-8-2023) యువగళం వివరాలు*

*వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి గుంటూరు జిల్లా)*

ఉదయం

8.00 – కెలంపల్లి శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.20 – కెలంపల్లిలో స్థానికులతో మాటామంతీ.

8.35 – పాదయాత్ర వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

8.55 – ముప్పరాజువారిపాలెంలో స్థానికులతో సమావేశం.

10.10 – రాముడుపాలెంలో స్థానికులతో సమావేశం.

11.10 – పుచ్చనూతల జెసి నగర్ లో స్థానికులతో సమావేశం.

11.40 – రవ్వవరంలో స్థానికులతో సమావేశం.

మధ్యాహ్నం

12.10 – పుచ్చనూతలలో భోజన విరామం.

1.00 – పుచ్చనూతలలో బిసి సామాజికవర్గీయులతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – పుచ్చనూతలనుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.20 – కొత్తరెడ్డిపాలెంలో స్థానికులతో సమావేశం.

4.40 – లక్ష్మీపురంలో స్థానికులతో సమావేశం.

5.40 – నూజండ్లలో స్థానికులతో సమావేశం.

7.10 – గుర్రపునాయుడుపాలెంలో రైతులతో సమావేశం.

7.30 – గుర్రపునాయుడుపాలెం శివారు విడిది కేంద్రంలో బస.

******




More Telugu News