క్రికెట్ మ్యాచ్ లో ఆరడుగుల జెర్రిపోతు కలకలం

  • శ్రీలంకలో లంక ప్రీమియర్ లీగ్ పోటీలు
  • గాలె టైటాన్స్, దంబుల్లా ఔరా జట్ల మధ్య మ్యాచ్
  • షకీబల్ హసన్ బౌలింగ్ చేస్తుండగా మైదానంలోకి పాము
  • ఆరడగుల పొడవున్న జెర్రిపోతు పాము
  • వెంటనే స్పందించి పామును బయటికి పంపించివేసిన సిబ్బంది
ఇటీవల క్రికెట్ స్టేడియాల్లోకి పాములు రావడం తరచుగా జరుగుతోంది. తాజాగా శ్రీలంకలో లంక ప్రీమియర్ లీగ్ (LPL) మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. దంబుల్లా ఔరా, గాలె టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, ఆరడుగుల పొడవున్న జెర్రిపోతు పాము మైదానంలో ప్రవేశించింది. గాలె స్పిన్నర్ షకీబల్ హసన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మైదానంలో ఒక్కసారిగా పాము కలకలం చెలరేగింది. దాంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. బౌండరీ వద్ద పామును చూసిన వారు మైదానం సిబ్బందిని అప్రమత్తం చేయడంతో, వారు వెంటనే స్పందించి ఆ పెద్ద పామును మైదానం బయటికి పంపించివేశారు. అనంతరం, మ్యాచ్ కొనసాగింది.


More Telugu News

Rat Snake Cricket Match LPL Sri Lanka