Manipur: మణిపూర్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం

  • మణిపూర్ లో చిచ్చు రేపిన రిజర్వేషన్ల అంశం
  • అట్టుడుకుతున్న పార్లమెంటు
  • నేడు సుప్రీంకోర్టులో మణిపూర్ అంశంపై విచారణ
  • ఎఫ్ఐఆర్ దాఖలుకు 14 రోజుల సమయం ఎందుకు పట్టిందన్న సుప్రీంకోర్టు
Supreme Court fires on Manipur Police

ఓ వర్గానికి రిజర్వేషన్ల అంశం మణిపూర్ లో చిచ్చు రగల్చగా, ఆ ఈశాన్య రాష్ట్రంలో తీవ్ర అల్లర్లు చెలరేగాయి. ఇప్పుడా అల్లర్లపై పార్లమెంటు అట్టుడుకుతోంది. అటు, సుప్రీంకోర్టులోనూ మణిపూర్ అంశంపై నేడు విచారణ జరిగింది. 

మణిపూర్ పోలీసుల తీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం ఎందుకు పట్టిందని సీజేఐ ధర్మాసనం ప్రశ్నించింది. మే 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పోలీసులు ఏం చేశారని నిలదీసింది. "రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేశారు?" అంటూ మండిపడింది. 

విచారణ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, ప్రభుత్వం ఏమీ దాచిపెట్టడంలేదని స్పష్టం చేశారు. దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించవచ్చని పేర్కొన్నారు. వాదనలు విన్న అనంతరం విచారణను రేపు మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్టు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

More Telugu News