Janasena: మంగళగిరిలో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద జనసేన వీర మహిళల ఆందోళన.. ఉద్రిక్తత

Police arrest Janasena women for dharna at women commission
  • పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన మహిళల ఆగ్రహం
  • మహిళా కమిషన్ కు ర్యాలీగా వెళ్లిన కార్యకర్తలు
  • పోలీసులు-కార్యకర్తల మధ్య తోపులాట, అరెస్ట్
తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ జనసేన వీరమహిళలు సోమవారం మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు.

పవన్‌పై వాసిరెడ్డి పద్మ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన కార్యకర్తలు మహిళా కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోగా, ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు మహిళలు పోలీసులను తోసుకుంటూ వెళ్లి కమిషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మరోసారి తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ జనసేన మహిళలు కార్యాలయం వెలుపల బైఠాయించగా, పోలీసులు అరెస్ట్ చేశారు.
Janasena
vasireddy padma
Pawan Kalyan
Mangalagiri

More Telugu News