Small Plane: ఇంజన్ ఫెయిల్ కావడంతో సముద్రంలో ల్యాండ్ అయిన విమానం.. ప్రయాణికులు సేఫ్

  • దక్షిణ ఫ్రాన్స్ లోని ఫ్రెజుస్ తీరంలో ఘటన
  • నీట మునిగిన విమానం
  • ప్రయాణికులను కాపాడిన రెస్క్యూ టీమ్
  • పైలట్ సమయస్పూర్తితో తప్పిన ప్రాణనష్టం
A Small Plane Made An Emergency Landing At Sea in France

ప్రయాణం మధ్యలో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడితే పైలట్లు వెంటనే దగ్గర్లోని విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. లోపాన్ని సరిచేశాక తిరిగి బయలుదేరతారు. అరుదుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయి. అయితే, ఫ్రాన్స్ లో మాత్రం ఓ పైలట్ తన విమానాన్ని ఏకంగా సముద్రంలో దించారు. తప్పనిసరి పరిస్థితిలో మరో మార్గంలేక ఈ పనిచేయాల్సి వచ్చిందట. అయితే, బీచ్ రెస్క్యూ టీమ్ వెంటనే స్పందించి ఆ పైలట్ ను ఇద్దరు ప్రయాణికులను రక్షించారు.

దక్షిణ ఫ్రాన్స్ లోని ఫ్రెజుస్ తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పైలట్ తో పాటు ఇద్దరు ప్రయాణికులతో వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం ఇంజన్ ఫెయిల్ అయింది. దగ్గర్లో విమానాశ్రయం లేకపోవడంతో పక్కనే ఉన్న బీచ్ లో విమానాన్ని ల్యాండ్ చేయాలని పైలట్ భావించారు. అయితే, బీచ్ లో ఉన్న పర్యాటకుల కారణంగా ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి సముద్రంపై దించారు. విమానం నీళ్లలో ల్యాండ్ కావడం చూసి బీచ్ లోని రెస్క్యూ బృందం అప్రమత్తమైంది. వెంటనే బోట్లలో ప్రమాద స్థలానికి చేరుకుని ముగ్గురినీ రక్షించి, ఒడ్డుకు చేర్చింది. విమానం మాత్రం సముద్రంలో మునిగిపోయింది.

More Telugu News