Team India: ఆ విషయంలో నేనిప్పుడు తాబేలునే.. కుందేలును కానంటున్న హార్దిక్​ పాండ్యా

  • వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా
  • పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేయలేకపోతున్న ఆల్‌ రౌండర్
  • తన పనిభారాన్ని క్రమంగా పెంచుకుంటానని చెప్పిన పాండ్యా
Iam a turtle right now not rabbit says Hardik on his bowling workload management

వెస్టిండీస్ తో రెండో వన్డేలో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా ఓటమి చవిచూశాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ లో నిరాశ పరిచిన పాండ్యా బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో అతని మ్యాచ్‌ ఫిట్‌నెస్‌పై అనుమానాలు, విమర్శలు వస్తున్నాయి. దీనిపై పాండ్యా స్పందించాడు. గాయాల నుంచి కోలుకొని తిరిగివచ్చిన హార్దిక్.. బౌలింగ్‌ విషయంలో ప్రస్తుతానికి తాను తాబేలులా ఒక్కో అడుగు వేస్తున్నానని చెప్పాడు. అంతేతప్ప ఇప్పటికిప్పుడు కుందేలులా వేగం చూపలేనన్నాడు. 

భుజం, వెన్ను గాయాల నుంచి కోలుకున్న తాను క్రమంగా బౌలింగ్‌ పనిభారాన్ని పెంచుకుంటున్నానని తెలిపాడు. గాయాల కారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ ను తక్కువగా ఆడుతున్నానని వెల్లడించాడు. ‘ప్రస్తుతానికి నా శరీరం బాగానే ఉంది. వన్డే ప్రపంచ కప్‌ వరకు మరిన్ని ఎక్కువ ఓవర్లు బౌలింగ్‌ చేసేలా సన్నద్ధం అవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను తాబేలునే, కుందేలును మాత్రం కాదు. ప్రపంచ కప్ వరకు అన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయని ఆశిస్తున్నా’ అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. కాగా, వెస్టిండీస్, భారత్‌ మధ్య సిరీస్‌ విజేతను నిర్ణయించే మూడో వన్డే మంగళవారం జరగనుంది.

More Telugu News