Lawrence: ఐదు భాషల్లో 'చంద్రముఖి 2' .. రిలీజ్ డేట్ ఖరారు!

  • 2005లో వచ్చిన 'చంద్రముఖి' ఒక సంచలనం 
  • ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన 'చంద్రముఖి 2'
  • టైటిల్ రోల్ ను పోషించిన 'కంగనా రనౌత్ 
  • 'వినాయక చవితి'కి ఐదు భాషల్లో విడుదల 
Chandramukhi release date confirmed

హారర్ కామెడీ సినిమాలకు లారెన్స్ కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తాడు. ఈ క్రమంలో ఆయన నుంచి మరో హారర్ కామెడీ సినిమాగా 'చంద్రముఖి 2' రాబోతోంది. గతంలో 'చంద్రముఖి' సినిమాను తెరకెక్కించిన పి. వాసునే సీక్వెల్ కి కూడా దర్శకుడు. ఈ సీక్వెల్ ను కూడా ఆయన రజనీతోనే చేయడానికి ట్రై చేశాడు గాని కుదరలేదు.

లారెన్స్ - కంగనా రనౌత్ ప్రధానమైన పాత్రలుగా 'చంద్రముఖి 2' రూపొందింది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, 'వినాయక చవితి'కి ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. బంగ్లా మెట్లు దిగుతూ రాజావారి లుక్ లో లారెన్స్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు.

వాసు - లారెన్స్ కాంబినేషన్లో 2017లో 'శివలింగ' అనే సినిమా వచ్చింది. హారర్ కామెడీ జోనర్లోనే రూపొందిన ఆ సినిమా బాగానే ఆడింది. ఆ తరువాత వాళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా ఇదే. 'చంద్రముఖి' సినిమాకి విద్యాసాగర్ సంగీతం ప్రాణంగా నిలిచింది. సీక్వెల్ కి కీరవాణి సంగీతాన్ని సమకూర్చడం విశేషం. ఈ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి.

More Telugu News