Warangal: హైదరాబాద్‌లో వరంగల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి

  • పాస్‌పోర్టు కోసం తండ్రితో కలిసి నగరానికి వచ్చిన మణిరాజ్
  • కుమారుడిని వదిలి తిరిగి తిరిగి వరంగల్ వెళ్లిన తండ్రి
  • స్నేహితుడి ఇంటికి వెళ్లిన మణిరాజ్
  • బాత్రూంలో అనుమానాస్పద మృతి
Warangal software engineer died in Hyderabad

వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హైదరాబాద్‌లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పాస్‌పోర్టు తీసుకునేందుకు త్రిపురాది మణిరాజ్ (30) తండ్రి నవీన్‌కుమార్‌తో కలిసి ఈ నెల 28న హైదరాబాద్ వచ్చాడు. పని పూర్తయ్యాక అదే రోజు సాయంత్రం నవీన్ కుమార్ తిరిగి వరంగల్ వెళ్లిపోగా, మణిరాజ్ అల్కాపూర్‌లో ఉండే స్నేహితుడు కొత్త చాణక్య ఇంటికి వెళ్లాడు.

మణిరాజ్ తర్వాతి రోజు స్నేహితులతో కలిసి వెస్ట్‌మారేడ్‌ప్లలిలోని గణేశ్ ఆలయం, జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ దేవాలయాన్ని దర్శించుకున్నాడు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి మణిరాజ్ నేరుగా చాణక్య ఇంటికి చేరుకున్నాడు. నిన్న ఉదయం అపార్ట్‌మెంట్ మీటింగ్ ఉండడంతో బాత్రూంలో ఉన్న స్నేహితుడికి చెప్పి చాణక్య వెళ్లాడు. 

మీటింగ్ పూర్తయ్యాక 11.30 గంటలకు తిరిగి వచ్చాక మణిరాజ్ కనిపించకపోవడంతో బాత్రూం తలుపు తట్టాడు. అయినా స్పందన లేకపోవడంతో ఇరుగుపొరుగువారిని పిలిచి తలుపులు బద్దలుకొట్టి చూడగా మణిరాజ్ మృతి చెంది కనిపించాడు. విషయాన్ని చాణక్య వెంటనే ఆయన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. నగరానికి చేరుకున్న నవీన్ కుమార్ కుమారుడి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News