Shankar: భారత చిత్ర పరిశ్రమకు నిజమైన 'గేమ్ చేంజర్' మీరే: శంకర్ ను ఉద్దేశించి రామ్ చరణ్ ట్వీట్

Ram Charan describes director Shankar as the real Game Changer of Indian cinema
  • శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్
  • దర్శకుడిగా 30 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న శంకర్
  • ట్విట్టర్ లో అభినందనలు తెలిపిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
  • శంకర్ నుంచి మరిన్ని గొప్ప చిత్రాలు రావాలంటూ ఆకాంక్ష
దక్షిణాది సినీ పరిశ్రమకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో శంకర్ ముందు వరుసలో ఉంటారు. అంతేకాదు, భారత చిత్ర పరిశ్రమలో చూస్తే శంకర్ నిస్సందేహంగా ఓ దిగ్గజం. దర్శకుడిగా ఆయన కెరీర్ కు 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా శంకర్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపారు. 

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, భారత చిత్ర పరిశ్రమకు మీరే నిజమైన 'గేమ్ చేంజర్' అంటూ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ ను కొనియాడారు. 

"అద్భుతం అనదగ్గ రీతిలో మీ కెరీర్ లో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు శుభాభినందనలు శంకర్ సర్. మీ నుంచి మరిన్ని గొప్ప చిత్రాలు రావాలని, మరిన్ని ఘనతలను మీరు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ రామ్ చరణ్ ట్విట్టర్ లో స్పందించారు. 

అంతేకాదు, గేమ్ చేంజర్, ఇండియన్-2 చిత్రబృందాలు శంకర్ ను అభినందిస్తూ రూపొందించిన ప్రత్యేక పోస్టర్ ను కూడా పంచుకున్నారు.
Shankar
Ramcharan
30 Years
Game Changer

More Telugu News