Nara Lokesh: సీఎం జగన్ ది సిగ్గులేని జన్మ: అద్దంకిలో లోకేశ్ వాడీవేడి ప్రసంగం

  • బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో యువగళం
  • అద్దంకిలో లోకేశ్ బహిరంగ సభ
  • అద్దంకి పులి అంటూ గొట్టిపాటి రవికుమార్ పై ప్రశంసల వర్షం
  • బీసీల పాలిట జగన్ సైతాన్ లా మారాడని విమర్శలు
  • టీడీపీ గెలిచాక అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలుపుతామని వెల్లడి
Lokesh powerful speech in Addanki

బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. లోకేశ్ ఇవాళ అద్దంకిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు విశేష స్పందన లభించింది. లోకేశ్ తన పదునైన ప్రసంగంతో సీఎం జగన్, వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో అధికార పార్టీ నేతలను ఏకిపారేశారు.
అద్దంకి మాస్ జాతర అదిరిపోయింది


అద్దంకిలో భారీ జనసందోహాన్ని చూస్తుంటే ఉత్సాహం రెట్టింపవుతోంది. అద్దంకిలో మాస్ జాతర అదిరిపోయింది. రెడ్డి రాజులు పాలించిన నేల అద్దంకి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాలు ఉన్న పుణ్యభూమి అద్దంకి. దేశం కోసం పోరాడిన ప్రకాశం పంతులు గారు నడిచిన నేల అద్దంకి. వరుసగా నాలుగు సార్లు మన పులి రవి గారిని గెలిపించిన నేల అద్దంకి. ఎంతో ఘన చరిత్ర ఉన్న అద్దంకి గడ్డపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

జగన్ బీసీల పాలిట సైతాన్ గా మారాడు

మన జయహో బీసీ కార్యక్రమం చూసి జగన్ గజ గజా వణికిపోయాడు. గల్లీ నుండి ఢిల్లీ వరకూ వైసీపీ బీసీ నేతల్ని రంగంలోకి దింపి నన్ను తిట్టించాడు. కనీసం నన్ను తిట్టడానికైనా వైసీపీలో ఉన్న బీసీ నేతలకి మాట్లాడే అవకాశం ఇచ్చాడు.. అందుకు సంతోషం! 

15 ఏళ్ల పిల్లాడు అమర్నాథ్ గౌడ్ ని కాళ్లు, చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెడితే వైసీపీ బీసీ నాయకులు ఏం అయ్యారు? 5వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం జరిగితే వైసీపీలో ఉన్న బీసీ నేతలు గొంతు విప్పలేదు. 

ఇప్పుడు ఏకంగా బీసీ సమాజాన్నే అవమానించాడు సైకో జగన్. బిడ్డని కోల్పోయిన ఒక తల్లిని, తమ్ముడ్ని కోల్పోయిన ఒక అక్కని, భర్తని కోల్పోయిన భార్యని, తండ్రిని కోల్పోయిన కొడుకుని జగన్ పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానించాడు. ఆఖరికి కార్యక్రమం హోస్ట్ చేసిన బీసీ బిడ్డ ఉదయభాను గారిని కూడా ట్రోల్ చేసింది పేటీఎం గ్యాంగ్. ఆవిడ చేసిన తప్పేంటి?... ఒక బీసీ బిడ్డ గొంతు విప్పి మాట్లాడటం కూడా తప్పేనా? 

బీసీ వర్గానికి చెందిన బాధితులను పెయిడ్ ఆర్టిస్టులు, డ్రామా ఆర్టిస్టులు అనడానికి మనస్సు ఎలా వచ్చింది సైకో జగన్. జగన్ ది సిగ్గులేని జన్మ. ఒక్క బీసీ కుటుంబాన్ని ఆదుకున్నావా? ఒక్క బాధిత కుటుంబాన్ని పరామర్శించావా?  

జగన్ బటన్ బలహీనపడింది

జగన్ బటన్ వీక్ అయ్యింది. ఆయన బటన్ కి పవర్ లేదు. అమ్మ ఒడి బటన్ నొక్కి నెల రోజులైంది. అయినా డబ్బులు పడలేదు. తల్లిని, చెల్లిని గెంటేసినవాడికి రాష్ట్రంలో ఉన్న అమ్మల బాధలు తెలుస్తాయా? ఎన్నికల ముందు, ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మఒడి అన్నాడు. దానిని  అర్ధ ఒడి చేశాడు. 

అధికారంలోకి వచ్చాక, షరతులు వర్తిస్తాయంటూ అంటూ ఒక బిడ్డకే అని అర్ధ ఒడి చేశాడు. రూ.15 వేలు ఇస్తానని అన్నాడు. మెయింటెనెన్స్ పేరుతో రూ.2 వేలు కోసి రూ.13 వేలు ఇస్తాను అన్నాడు. ఇప్పుడు డబ్బులు లేకుండానే బటన్ నొక్కాడు. నెల రోజులు అవుతున్నా డబ్బులు పడటం లేదు. 

మన అద్దంకి పులి... గొట్టిపాటి రవి

అద్దంకిని అభివృద్ధి చేసింది టీడీపీ. ప్రకాశం పులి గొట్టిపాటి రవి గారు రూ.2000 వేల కోట్లతో అద్దంకిని అభివృద్ధి చేశారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేశాం. సింగరకొండలో ఐటీఐ కాలేజ్, ఇండోర్ స్టేడియం నిర్మించాం. అద్దంకి ప్రజల దాహం తీర్చేందుకు 80 కోట్లతో శాశ్వత తాగునీటి పథకం ఏర్పాటు చేశాం. రైతులు పండించిన పంట దళారుల చేతికి వెళ్లకుండా రైతులే అమ్ముకునే విధంగా అన్న గారి సంత ఏర్పాటు చేశాం. రాష్ట్రంలోనే ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చింది అద్దంకికే. 

వైసీపీ వచ్చాక అద్దంకి అనాథలా మారింది

వైసీపీప్రభుత్వం వచ్చిన తరువాత అద్దంకి పరిస్థితి ఏంటి? అద్దంకి ప్రజలంటే జగన్ కి కోపం అందుకే అద్దంకిని అనాథగా వదిలాడు. పెద్ద సైకోని చూసి పిల్ల సైకోలు రెచ్చిపోతున్నారు. పిల్ల సైకోల ఇసుక దోపిడీ ఏ రేంజ్ లో ఉందో తెలుసా... గుండ్లకమ్మ డ్యామ్ గేట్లు కొట్టుకుపోయి ఏడాది అయ్యింది. గేట్లు బిగిస్తే ఇసుక దోపిడీ సాధ్యం కాదని గేట్లు పెట్టడం లేదు. 

పిల్ల సైకోల కక్కుర్తి వలన గుండ్లకమ్మ నదిపై ఆధారపడిన 13 గ్రామాల మత్స్యకారులు రోడ్డున పడ్డారు. సెంటు స్థలాల్లో భారీ స్కాం చేశారు పిల్ల సైకోలు. ఎకరం రూ.10 లక్షలకు కొని ప్రభుత్వానికి రూ.27 లక్షలకు అమ్మేశారు. 

దేవుడ్ని కూడా వదలలేదు. సింగరకొండ పుణ్యక్షేత్రంలో కాంట్రాక్టు పోస్టుల దగ్గర నుండి, షిఫ్ట్ ఆపరేటర్, వాచ్ మన్, అంగన్వాడీ పోస్టుల వరకూ ప్రతి ఉద్యోగానికి ఒక రేటు పెట్టి అమ్మేస్తున్నారు పిల్ల సైకోలు. గ్రానైట్ యజమానులను బెదిరించి లారీకి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు పిల్ల సైకోలు. 

అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలుపుతాం

జగన్ పనైపోయింది. 2024లో గెలిచేది టీడీపీనే. అద్దంకిలో భారీ మెజారిటీతో మన పులి రవి గారిని గెలిపించండి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలుపుతాం. వైవీ సుబ్బారెడ్డి గారి తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన పోలిరెడ్డి కొరిశపాడు లిఫ్ట్ ప్రాజెక్ట్ జగన్ పూర్తి చెయ్యలేదు. టీడీపీ గెలిచిన వెంటనే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. 

ఆపేసిన భవనాశి  రిజర్వాయర్ పనులు పూర్తిచేస్తాం. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. గుండ్లకమ్మ బ్రిడ్జ్ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. కొత్త బ్రిడ్జ్ నిర్మిస్తాం. గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామల ప్రజలకు అన్ని మౌలిక వసతులతో కాలనీలు ఏర్పాటు చేస్తాం. 

మన పులి ఎక్కడా తగ్గలేదు

అద్దంకి ప్రజల కోసం పోరాడినందుకు రవి గారిని వేధించారు. సమస్యలు పరిష్కరించమని ప్రశ్నించినందుకు వెంటాడారు. అయినా మన పులి తగ్గుతుందా? ఒక్కటే చెప్పాడు...
ఫ్లూటు జింక ముందు ఊదు... పులి ముందు కాదని. వైసీపీ ఇప్పటికే వెంటిలేటర్ పై ఉంది... ఇలాంటి పరిస్థితుల్లోనూ వైసీపీ నేతలు సవాళ్లు విసరడం సిల్లీగా ఉంది.

More Telugu News