Hyderabad: విద్యుత్ శాఖ ఉద్యోగికి సీఐడీ ఎస్పీ వేధింపులు

Hyderabad police filed Harrasment case on cid sp kishan singh
  • బాధితురాలి ఫోన్ కు అసభ్యకరమైన సందేశాలు
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
  • చైతన్యపురి స్టేషన్ లో కేసు నమోదు
హైదరాబాద్ లో విద్యుత్ శాఖ ఉద్యోగిని వేధిస్తున్న సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోన్ కు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడని సదరు ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాతీయ క్రీడల పోటీలకు సిద్ధమయ్యేందుకు సరూర్ నగర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా కిషన్ సింగ్ తో పరిచయమైందని చెప్పారు. ప్రిపరేషన్ కు సంబంధించి మెలకువలు చెబుతానంటూ మొబైల్ నెంబర్ తీసుకున్నారని వివరించారు.

తర్వాత అభ్యంతరకరమైన సందేశాలు పంపించడం మొదలు పెట్టాడని తెలిపారు. శారీలో చూడాలని ఉందని, ఫొటోలు పంపాలని మెసేజ్ లు చేస్తున్నాడని బాధితురాలు వాపోయారు. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంపుతున్నాడని వివరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Hyderabad
cid
sp kishan singh
chaitanyapuri
police

More Telugu News