Vijay: 'లియో'లో ఆంటోని దాస్ గా సంజయ్ దత్ .. గ్లింప్స్ రిలీజ్!

Leo Movie Glimpse Released

  • విజయ్ - త్రిష జంటగా రూపొందుతున్న 'లియో'
  • 'మాస్టర్' తరువాత లోకేశ్ తో విజయ్ చేస్తున్న సినిమా 
  • సంజయ్ దత్ ఎంట్రీతో మరింత పెరిగిన 'లియో' క్రేజ్ 
  • అక్టోబర్ 19వ తేదీన సినిమా విడుదల 

ఈ రోజున బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తెలుగులో ఆయన చేస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' నుంచి స్పెషల్ పోస్టర్ ను వదిలారు. ఆ సినిమాలో ఆయన పోషిస్తున్న 'బిగ్ బుల్' పాత్రను పరిచయం చేశారు. అలాగే తాజాగా తమిళంలో ఆయన చేస్తున్న 'లియో' సినిమా నుంచి కూడా ఓ పోస్టర్ ను వదిలారు. 

లలిత్ కుమార్ - జగదీశ్ పళనిస్వామి నిర్మిస్తున్న ఈ సినిమాకి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ - త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమాలో, ఆంటోని దాస్ అనే కీలకమైన పాత్రను సంజయ్ దత్ పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ ను .. గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. 

అనిరుధ్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అర్జున్ ... గౌతమ్ మీనన్ ... మన్సూర్ అలీఖాన్ .. ప్రియా ఆనంద్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. 'మాస్టర్' కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

  • Loading...

More Telugu News