Raghu Rama Krishna Raju: 'బ్రో' సినిమాలో అంబటి రాంబాబు గురించి బాగానే చెప్పారు: రఘురామకృష్ణ రాజు

  • ఎంత సంపాదించినా పోవాల్సిందేనని సినిమాలో చెప్పారన్న రఘురాజు
  • పైశాచిక ఆనందంతో మార్గదర్శిపై జగన్ దాడిని ప్రారంభించారని విమర్శ
  • తండ్రి అధికారంలోకి రాగానే జగన్ ఎన్నో కంపెనీలు పెట్టారని ఆరోపణ
Raghu Rama Krishna Raju response on dialogues on Ambati Rambabu in Bro movie

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'బ్రో' ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించిన డైలాగులు, ఆయన చేసిన తరహా డ్యాన్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. దీంతో ఈ ఉదయం నుంచి దీనిపై రచ్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'బ్రో' సినిమాలో అంబటి రాంబాబు గురించి మంచి మాటలే ఉన్నాయని ఆయన అన్నారు. ఎంత సంపాదించినా పోవాల్సిందే అనే విషయాన్ని సినిమాలో చెప్పారని తెలిపారు. 

పైశాచిక ఆనందంతో మార్గదర్శిపై ముఖ్యమంత్రి జగన్ దాడిని ప్రారంభించారని విమర్శించారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా మార్గదర్శిపై కేసులు పెట్టించారని దుయ్యబట్టారు. తండ్రి అధికారంలోకి రాగానే ఇన్ని కంపెనీలు పెట్టి జగన్ ఎలా సంపాదించారని ప్రశ్నించారు. రాజమండ్రిలోని ఆవ భూముల్లో వైసీపీ నేతలు రూ. 150 కోట్లు మింగేశారని ఆరోపించారు. పోలీసులు చిత్తశుద్ధితో ఉద్యోగాలను నిర్వహించాలని... రాజకీయ నాయకులు చెప్పినట్టుగా చేయవద్దని సూచించారు.

More Telugu News