AP Police: పరీక్షకు హాజరవ్వాల్సిన విద్యార్థులను క్రేన్ ద్వారా వరద ప్రవాహాన్ని దాటించిన ఏపీ పోలీసులు.... వీడియో ఇదిగో!

  • నందిగామ వద్ద ఉద్ధృతంగా ప్రవహించిన మున్నేరు
  • ఐతవరం వద్ద రోడ్డుపైకి పొంగి ప్రవహించిన వాగు
  • పోలీసులను ఆశ్రయించిన పరీక్షకు వెళ్లాల్సిన  విద్యార్థులు
  • మానవతా దృక్పథంతో స్పందించిన పోలీసులు
AP Police sent students on a crane in knee deep flood water

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మున్నేరు ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఐతవరం వద్ద జాతీయ రహదారిపైకి ఉప్పొంగింది. దాంతో విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

కాగా, ఈ పరిస్థితిలో ఓ సెమిస్టర్ పరీక్షకు హాజరవ్వాల్సిన విద్యార్థులు కొందరు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరీక్షకు వెళ్లే మార్గం లేక పోలీసులను ఆశ్రయించారు. దీనిపై నందిగామ పోలీసులు మానవతా దృక్పథంతో స్పందించారు. 

అప్పటికప్పుడు ఓ క్రేన్ ను పిలిపించి, ఆ క్రేన్ పై విద్యార్థులను కూచోబెట్టి క్షేమంగా వరద ప్రవాహాన్ని దాటించారు. అంతేకాదు, పరీక్ష అయిపోయిన తర్వాత కూడా ఆ విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చారు. పోలీసుల సహాయ చర్యను అందరూ అభినందించారు. రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి సైతం తమ పోలీసులను అభినందించారు.

More Telugu News