Ivana: 'LGM' నుంచి వీడియో సాంగ్ రిలీజ్!

  • డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన 'LGM'
  • చాలా గ్యాప్ తరువాత వస్తున్న ఇవాన
  • కీలకమైన పాత్రను పోషించిన నదియా 
  • తెలుగు .. తమిళ భాషల్లో ఆగస్టు 4న రిలీజ్
LGM Video Song Release

సాక్షి సింగ్ ధోని నిర్మాతగా 'LGM' సినిమా రూపొందింది. వారి బ్యానర్ లో నిర్మితమైన ఫస్టు సినిమా ఇది. హరీశ్ కల్యాణ్ - ఇవాన జంటగా రూపొందిన ఈ సినిమాకి, రమేశ్ తమిళమణి దర్శకత్వం వహించాడు. ఒక ఇంట్లో కోడలిగా అడుగుపెట్టడానికి ముందే అత్తాకోడళ్లకి ఒకరిని గురించి ఒకరికి తెలియాలనే ఒక కామెడీ టచ్ కాన్సెప్ట్ తో ఈ కథ నడవనుంది. 

తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఆగస్టు 4వ తేదీన విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు. అందులో భాగంగానే ఈ సినిమా నుంచి తాజాగా ఒక వీడియో సాంగును విడుదల చేశారు. 'లలనా .. లలనా ప్రేమ ఒళ్లో పడ్డానా' అంటూ ఈ పాట సాగుతోంది.

హీరో .. హీరోయిన్ పై బీచ్ లో నైట్ లో చిత్రీకరించిన పాట ఇది. ఈ సినిమాకి సంగీతాన్ని కూడా రమేశ్ తమిళమణి అందించడం విశేషం. నదియా .. యోగిబాబు .. దీపా శంకర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 'లవ్ టుడే' సినిమాతో తెలుగులోను యూత్ ను ఆకట్టుకున్న ఇవాన, ఈ సినిమాతో ఇక్కడ అభిమానుల సంఖ్యను పెంచుకుంటుందేమో చూడాలి.

More Telugu News