H-1B Visa: త్వరలో హెచ్-1బీ వీసా లాటరీ రెండో రౌండ్

  • 2024 ఆర్థిక సంవత్సరం కోటా భర్తీకి మరో రౌండ్ లాటరీ నిర్వహించనున్న అమెరికా
  • గతంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాఖలైన వాటిల్లోంచి ర్యాండమ్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ల ఎంపిక
  • మార్చిలో తొలి రౌండ్ నిర్వహణ
  • భారతీయ టెకీలకు లాభించనున్న అమెరికా నిర్ణయం
second round of visa lottery to be conducted this year says uscis

2024 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా లబ్ధిదారుల ఎంపిక కోసం అమెరికా పౌరసత్వం, వలస సేవల శాఖ రెండోసారి లాటరీ నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం కోటా పూర్తయ్యేందుకు అదనపు లబ్ధిదారుల ఎంపిక కోసం లాటరీ నిర్వహించబోతున్నట్టు పేర్కొంది. గతంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాఖలు చేసిన రిజిస్ట్రేషన్లతో ర్యాండమ్ పద్ధతిలో ఈ లాటరీ నిర్వహిస్తామని వెల్లడించింది. 

హెచ్-1బీ వీసాల తొలి లాటరీ రౌండ్ మార్చిలో జరిగింది. అమెరికా ఏటా 65 వేల వీసాలను జారీ చేస్తుంటుంది. అమెరికా యూనివర్సిటీల్లో స్టెమ్ కోర్సులు చేసిన విదేశీయుల కోసం మరో 20 వేల హెచ్-1బీ వీసాలు అందుబాటులో ఉంటాయి. అమెరికా తాజా నిర్ణయంతో భారతీయ టెకీలకు లాభదాయకమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

More Telugu News