Andaman and Nicobar: అండమాన్ నికోబార్ దీవుల్లో 5.9 తీవ్రతతో భూకంపం

  • అర్ధరాత్రి 12.53 గంటలకు భూకంపం
  • పోర్ట్ బ్లెయిర్ కు ఆగ్నేయ దిశలో 126 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం
  • రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైన భూకంప తీవ్రత
Earthquake Hits Andaman And Nicobar Islands

సుందరమైన అండమాన్ నికోబార్ దీవులను మరోసారి భూకంపం వణికించింది. పోర్ట్ బ్లెయిర్ కు సమీపంలో భూమి కంపించింది. అర్ధరాత్రి 12.53 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదయింది. భూకంప కేంద్రం పోర్ట్ బ్లెయిర్ కు ఆగ్నేయ దిశలో 126 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూ ఉపరితలానికి 69 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

More Telugu News