బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు
- వచ్చే 24 గంటల్లో ఏపీలో చెదురుమదురు వర్షాలు
- ఉపరితల ఆవర్తనంగా మారిన అల్పపీడనం
- తగ్గుముఖం పట్టిన వానలు
రుతుపవన ద్రోణి బంగాళాఖాతం వరకు విస్తరించింది. దీంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నిన్న రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.