Thailand: థాయిలాండ్ నుంచి ఏలూరు వచ్చి.. రూ. 3 లక్షలకు కోడిపుంజును కొన్న యువతీయువకులు!

  • రంగాపురంలో కోళ్లపారం నిర్వహిస్తున్న రత్తయ్య
  • రూ. 27 లక్షల పందెంలో గెలిచిన పుంజు
  • దానిని విక్రయించేందుకు రత్తయ్య నిరాకరణ
  • మరో పుంజును కొనుక్కెళ్లిన థాయ్ వాసులు
Thailand youth came to west godavari dist to by cock

థాయిలాండ్ నుంచి ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని రంగాపురానికి వచ్చిన కొందరు యువతీ యువకులు ఓ కోడిపుంజును రూ. 3 లక్షలకు కొనుక్కుని వెళ్లారు. గ్రామానికి చెందిన కూరాకుల రత్తయ్య గ్రామంలో కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భోగి రోజున ఆయన తన పుంజుతో పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో రూ. 27 లక్షల పందెం కాసి నెగ్గాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

దానిని చూసిన థాయిలాండ్‌ వాసులైన ఇద్దరు యువకులు, మరో ఇద్దరు యువతులు ఆ పుంజును కొనుక్కోవాలని భావించి ఇండియాకు వచ్చారు. బుధవారం వారు రంగాపురం గ్రామానికి చేరుకుని రత్తయ్యను కలిశారు. అయితే, ఆ కోడిపుంజును అమ్మేందుకు ఆయన నిరాకరించడంతో మరో కోడిపుంజును రూ. 3 లక్షలకు కొనుగోలు చేసి తమతో తీసుకెళ్లారు. పందెంలో గెలిచిన కోడితో వారు ఫొటోలు దిగారు. ఈ వివరాలను రత్తయ్య నిన్న వెల్లడించారు.

More Telugu News