'బ్రో' చాలా బాగుంది... పవన్ ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం: రఘురామ

  • పవన్, సాయితేజ్ ప్రధాన పాత్రల్లో బ్రో
  • నేడు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
  • పాజిటివ్ టాక్ తెచ్చుకున్న బ్రో
  • ఇప్పుడే బ్రో సినిమా చూశానన్న రఘురామకృష్ణరాజు
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో చిత్రం నేడు (జులై 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే బ్రో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా బ్రో చిత్రాన్ని చూసినట్టు వెల్లడించారు. 

"పవన్ కల్యాణ్ నటించిన బ్రో చిత్రాన్ని ఇప్పుడే చూశాను. పవన్ కల్యాణ్ అభిమానులే కాదు, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం. మనిషి బతుకు గురించి, ఈ భూమ్మీద ఎవరూ శాశ్వతం కాదన్న విషయాన్ని గురించి ఈ సినిమాలో చూపించారు. పవన్ కల్యాణ్ గారికి, సాయిధరమ్ తేజ్, త్రివిక్రమ్ గారికి, ఈ చిత్ర నిర్మాత, నా స్నేహితుడు టీజీ విశ్వప్రసాద్, దర్శకుడు సముద్రఖని, సంగీత దర్శకుడు తమన్, యావత్ చిత్రబృందానికి శుభాభినందనలు" అంటూ  రఘురామ ట్వీట్ చేశారు.


More Telugu News

Raghu Rama Krishna Raju BRO Pawan Kalyan Sai Dharam Tej Samuthirakani