godavari: భద్రాచలంలో మునిగిన స్నానఘట్ట ప్రాంతం.. గోదావరి నీటిమట్టం 58 అడుగులకు చేరే అవకాశం!

  • శుక్రవారం రాత్రి 52.1 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
  • ఇప్పటికే కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక 
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్  
Godavari water level may reach 58 feet

కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆగిపోయాయి! అయితే ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు వస్తుండటంతో పలు నదులలో నీటి ప్రవాహం పెరుగుతోంది. గోదావరి నదికీ వరద నీరు పెరుగుతుండటంతో ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు గోదావరి నీటి మట్టం 52.1 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి మట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.

గోదావరి నీటి మట్టం పెరుగుతుండటంతో భద్రాచలంతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భద్రాచలంలో స్నానఘట్టాల ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడంతోపాటు బందోబస్తు ఏర్పాటు చేశారు. నీటి మట్టం 56 అడుగుల నుండి 58 అడుగులకు చేరుకునే అవకాశముందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

More Telugu News