Gudivada Amarnath: పురందేశ్వరి గారూ... మీరు కూడా చంద్రబాబు మాయలో పడతానంటే మీ ఇష్టం: మంత్రి అమర్నాథ్

Minister Gudivada Amarnath slams AP BJP Chief Purandeswari
  • ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా పురందేశ్వరి
  • వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు
  • మరిది చంద్రబాబు స్క్రిప్టునే చిన్నమ్మ చదువుతున్నారన్న మంత్రి అమర్నాథ్
  • పురందేశ్వరి టీడీపీ అధ్యక్షురాలైతే బాగుంటుందని వ్యంగ్యం
ఇటీవలే ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన దగ్గుబాటి పురందేశ్వరిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు మాయల ఫకీరు వంటివాడని, ఆయన మాయలో పడి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయంగా నష్టపోయారని అన్నారు. పురందేశ్వరి గారూ... ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడుస్తామంటే మీ ఇష్టం అని వ్యాఖ్యానించారు. 

'పురందేశ్వరి తండ్రి స్థాపించిన పార్టీని ఇప్పుడు మరిది నడుపుతున్నారు... వీళ్లేమో వేరే పార్టీని నడుపుతున్నారు' అంటూ గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. 

మరిది స్క్రిప్టునే పురందేశ్వరి మాట్లాడుతున్నారని, ఇంతకీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మీరా? చంద్రబాబా? అనేది చెప్పాలన్నారు. లేకపోతే, పురందేశ్వరి టీడీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుని మాట్లాడితే బాగుంటుందని వ్యంగ్యం ప్రదర్శించారు.
Gudivada Amarnath
Daggubati Purandeswari
Chandrababu
YSRCP
BJP
TDP
Andhra Pradesh

More Telugu News