GV Anjaneyulu: వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు నిజ స్వరూపం ఏమిటో బయటపడింది: టీడీపీ నేత జీవీ ఆంజనేయులు

MLA Brahma Naidu character came out says GV Anjaneyulu
  • కావాలనే వినుకొండలో టీడీపీ శ్రేణులపై దాడులు చేశారన్న ఆంజనేయులు 
  • తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతోనే దాడులు జరిగాయని ఆరోపణ 
  • బ్రహ్మనాయుడుని గుడ్డలూడదీసి రోడ్డు మీద నిలబెడతామని వార్నింగ్ 
వినుకొండలో నిన్న టీడీపీ, వైసీపీ శ్రేణల మధ్య పెద్ద ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. తనను చంపేసి వినుకొండలో గెలవాలని టీడీపీ భావిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత స్పందిస్తూ... ఉద్దేశ పూర్వకంగానే వినుకొండలో టీడీపీ శ్రేణులపై దాడులు చేశారని చెప్పారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతోనే దాడులు జరిగాయని మండిపడ్డారు. 

పల్నాడులో నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక పోలీసులే కర్రలు ఇచ్చి దాడులకు సహకరించారని చెప్పారు. అవసరం లేకుండానే సీఐ ఫైరింగ్ చేశారని... ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మాచర్ల నుంచి వచ్చిన వైసీపీ నేతలు వినుకొండలో హల్ చల్ చేస్తే... వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. బొల్లా బ్రహ్మనాయుడు నిజ స్వరూపం ఏమిటనేది నిన్న బయటపడిందని... ఇక నుంచి ఆయన గుడ్డలూడదీసి రోడ్డుపై నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. 
GV Anjaneyulu
Telugudesam
Brahma Naidu
YSRCP

More Telugu News