పవన్ కల్యాణ్ ను ఏపీ సీఎం అంటూ ట్వీట్ చేసి ట్రోలింగ్ కు గురైన ఊర్వశి రౌతేలా
- బాస్ పార్టీ పాటతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశి
- బ్రో సినిమాలో ప్రత్యేక పాటలో నర్తించిన బాలీవుడ్ నటి
- ఈ రోజు విడుదలైన బ్రో చిత్రం
స్టేజ్ పై పవన్, సాయితేజ్ తో కలిసి దిగిన ఫొటోను తన ట్విట్టర్ లో షేర్ చేసిన ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కు గురవుతోంది. ఆ ఫొటో క్యాప్షన్ లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని నటి పొరపాటుగా ప్రస్తావించడం ఇందుకు కారణమైంది. పవన్ సీఎం కాదన్న సంగతి కూడా ఆమెకు తెలియదా? అని కొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు పవన్, మెగా ఫ్యాన్స్, జనసైనికులు మాత్రం.. 2024లో జరగబోయే దాన్ని ఊర్వశి ముందుగానే అంచనా వేసిందంటూ పొగుడుతున్నారు.