Urvashi Rautela: పవన్ కల్యాణ్ ను ఏపీ సీఎం అంటూ ట్వీట్ చేసి ట్రోలింగ్ కు గురైన ఊర్వశి రౌతేలా

Urvashi Rautela calls Pawan Kalyan CM of Andhra Pradesh gets brutally trolled
  • బాస్ పార్టీ పాటతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశి
  • బ్రో సినిమాలో ప్రత్యేక పాటలో నర్తించిన బాలీవుడ్ నటి
  • ఈ రోజు విడుదలైన బ్రో చిత్రం
వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ పాటలో నర్తించి టాలీవుడ్ కు చేరువైన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా. ఆ తర్వాత ప్రత్యేక పాటల కోసం ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా పవన్ కల్యాణ్, సాయితేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమాలోనూ ఆమె ఓ పాటలో నటించింది. ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కాగా, హైదరాబాద్ లో రెండు రోజుల కిందట జరిగిన ‘బ్రో’ సినిమా ప్రీ రిలీజ్ పంక్షన్లో ఊర్వశి సందడి చేసింది.

స్టేజ్ పై పవన్, సాయితేజ్ తో కలిసి దిగిన ఫొటోను తన ట్విట్టర్ లో షేర్ చేసిన ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కు గురవుతోంది. ఆ ఫొటో క్యాప్షన్ లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని నటి పొరపాటుగా ప్రస్తావించడం ఇందుకు కారణమైంది. పవన్ సీఎం కాదన్న సంగతి కూడా ఆమెకు తెలియదా? అని కొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు పవన్, మెగా ఫ్యాన్స్, జనసైనికులు మాత్రం.. 2024లో జరగబోయే దాన్ని ఊర్వశి ముందుగానే అంచనా వేసిందంటూ పొగుడుతున్నారు.
Urvashi Rautela
Pawan Kalyan
CM
Andhra Pradesh
Twitter

More Telugu News