Maharashtra: అప్పు తీర్చట్లేదంటూ భర్త ముందే భార్యపై అఘాయిత్యం

maharashtra woman violated infront her husband after failing to clear debt on time
  • పూణేలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
  • మహిళపై పలుమార్లు అఘాయిత్యం, అకృత్యాన్ని వీడియో రికార్డింగ్ చేసిన వైనం 
  • బాధితురాలు తిరగబడటంతో వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన నిందితుడు
  • నిందితుడి ఆగడాలు భరించలేక పోలీసులను ఆశ్రయించిన బాధితులు
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పు తీర్చట్లేదన్న కారణంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఓ మహిళపై ఆమె భర్త ముందే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడి ఆగడాలు భరించలేక బాధితులు తాజాగా పోలీసులను ఆశ్రయించారు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ఇంతియాజ్ షేక్ నుంచి బాధిత దంపతులు గతంలో కొంత రుణం తీసుకున్నారు. కానీ దాన్ని సకాలంలో చెల్లించలేకపోయారు. దీంతో, ఇంతియాజ్ మహిళ భర్తను కత్తితో బెదిరించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని రికార్డు చేసి ఆ తరువాత పలుమార్లు ఆమెను బలాత్కరించాడు. చివరకు ఆమె ఎదురుతిరగడంతో అతడు ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అతడి దుర్మార్గాలను భరించలేకపోయిన దంపతులు పోలీసులను ఆశ్రయించడంతో వారు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Maharashtra
Crime News
Pune

More Telugu News