Ishan Kishan: మెరిసిన ఇషాన్ కిషన్... తొలి వన్డేలో టీమిండియాదే విజయం

Ishan Kishan steers Team India to win 1st ODI against WI
  • బ్రిడ్జ్ టౌన్ లో టీమిండియా వర్సెస్ వెస్టిండీస్
  • కెన్సింగ్ టన్ ఓవల్ లో తొలి వన్డే
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • 23 ఓవర్లలో 114 పరుగులకు విండీస్ ఆలౌట్
  • 22.5 ఓవర్లలో ఛేదించిన టీమిండియా
  • ఇషాన్ కిషన్ అర్ధసెంచరీ
బ్రిడ్జ్ టౌన్ లో వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియానే విజయం సాధించింది. తొలుత వెస్టిండీస్ ను 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూల్చిన టీమిండియా.... ఆ తర్వాత 22.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. 

కెన్సింగ్ టన్ ఓవల్ మైదానంలో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ అర్ధసెంచరీతో మెరిశాడు. కిషన్ 46 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 52 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (7) విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 19 పరుగులు చేశాడు. 

హార్దిక్ పాండ్యా 5 పరుగులు చేసి రనౌట్ కాగా, శార్దూల్ ఠాకూర్ ఒక్క పరుగుకే అవుటయ్యాడు. రవీంద్ర జడేజా (16 నాటౌట్), కెప్టెన్ రోహిత్ శర్మ (12 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. రోహిత్ శర్మ రొటీన్ కు భిన్నంగా ఆరోస్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. రోహిత్ విన్నింగ్ షాట్ గా ఫోర్ కొట్టడంతో మ్యాచ్ పూర్తయింది. విండీస్ బౌలర్లలో గుడాకేశ్ మోతీ 2 వికెట్లు, జేడెన్ సీల్స్ 1, యానిక్ కరియా 1 వికెట్ తీశారు. 

ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జులై 29న బ్రిడ్జ్ టౌన్ లోనే జరగనుంది.
Ishan Kishan
Team India
West India
1st ODI
Bridgetown

More Telugu News