manipur: మణిపూర్‌లో మహిళల్ని నగ్నంగా ఊరేగించిన కేసు సీబీఐ చేతికి!

CBI to take over Manipur sexual assault case
  • వీడియో తీసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం
  • కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం!
యావత్ దేశాన్ని కలవరపాటుకు గురి చేసిన మణిపూర్ మహిళల నగ్న వీడియో కేసును కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐకి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు సంబంధించి వీడియో తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని మొబైల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

కేసు విచారణను కూడా మణిపూర్ బయట చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది. అసోంలోని న్యాయస్థానంలో ఈ కేసు విచారణను చేపట్టాలని కోరనున్నట్లు తెలిపాయి. మరోవైపు, మణిపూర్ లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు కేంద్ర హోంశాఖ మెయితీలు, కుకీలతో సంప్రదింపులు జరుపుతోంది. చర్చలు పురోగతిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
manipur
india

More Telugu News