DD Saptagiri: దూరదర్శన్ సప్తగిరి, యాదగిరి చానళ్లలో టీమిండియా, వెస్టిండీస్ మ్యాచ్ లు.... తెలుగులో కామెంటరీ

Limited Over cricket matches between India and West Indies will live telecast in DD Saptagiri and DD Yadagiri
  • భారత్, వెస్టిండీస్ మధ్య ముగిసిన టెస్టు సిరీస్
  • నేటి నుంచి పరిమిత ఓవర్ల సిరీస్ లు
  • బ్రిడ్జ్ టౌన్ లో నేడు తొలి వన్డే
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్ల మధ్య నేటి నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ లు జరగనున్నాయి. టీమిండియా, వెస్టిండీస్ 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడునున్నాయి. నేడు తొలి వన్డే బ్రిడ్జ్ టౌన్ లోని కెన్సింగ్ టన్ ఓవల్ లో జరగనుంది. టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది.

కాగా, ఈ పర్యటనలో టెస్టు మ్యాచ్ లను భారత్ లో డీడీ స్పోర్ట్స్ ప్రసారం చేసింది. అయితే, పరిమిత ఓవర్ల సిరీస్ లోని వన్డేలు, టీ20 మ్యాచ్ లను దూరదర్శన్ ప్రాంతీయ చానళ్లు కూడా ప్రసారం చేయనున్నాయి. 

డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి చానళ్లలోనూ టీమిండియా, వెస్టిండీస్ మ్యాచ్ ల లైవ్ కవరేజీ అందించనున్నారు. కామెంటరీ కూడా తెలుగులోనే అందించనుండడం విశేషం. దూరదర్శన్ లో తెలుగు కామెంటరీతో క్రికెట్ మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే మొదటిసారి.
DD Saptagiri
DD Yadagiri
Live
Cricket
Team India
West Indies

More Telugu News