Prabhas: మలయాళ స్టార్ హీరో డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా..?

Malayalam star Prithviraj to direct Prabhas
  • వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్
  • ప్రభాస్ ను డైరెక్ట్ చేయబోతున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్
  • ఇప్పటికే కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన పృథ్వీరాజ్
పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ తో ప్రభాస్ దూసుకుపోతున్నాడు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ ప్రభాస్ డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా సినిమాలు ఆయనకు క్యూ కడుతూనే ఉన్నాయి. ఇప్పటికే సలార్, కల్కి వంటి భారీ బడ్జెట్ సినిమాల షూటింగులతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ చిత్రం చేస్తున్నాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డికి కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. 

మరో క్రేజీ ప్రాజెక్ట్ ను కూడా ప్రభాస్ ఓకే చేసినట్టు తెలుస్తోంది. మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో లూసిఫర్, బ్రోడాడి వంటి సినిమాల్లో నటిస్తూ, వాటిని డైరెక్ట చేశాడు పృథ్వీరాజ్. ఈ నేపథ్యంలో ప్రభాస్, పృథ్వీరాజ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది.
Prabhas
Prithviraj
Tollywood

More Telugu News