Arjun Tendulkar: సిక్స్ ప్యాక్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్

  • ఫిట్ నెస్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన అర్జున్ టెండూల్కర్
  • సిక్స్ ప్యాక్ తో ఉన్న మిర్రర్ సెల్ఫీ ఫొటోను షేర్ చేసిన అర్జున్
  • ఈ ఐపీఎల్ లో మూడు వికెట్లు తీసి, 92 పరుగులు చేసిన అర్జున్
Arjun Tendulkar with 6 pack body

భారతీయ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కు ఈ ఏడాది ఐపీఎల్ మంచి మెమొరీస్ ను మిగిల్చింది. ఈ సీజన్ లో నాలుగు మ్యాచ్ లను ఆడిన అర్జున్ మూడు వికెట్లను తీయడమే కాక, 92 పరుగులు చేశాడు. అంతేకాదు దేశవాళీ క్రికెట్ లో భాగమైన దేవధర్ ట్రోఫీలో అర్జున్ సౌత్ జోన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. క్రికెట్ లో మరింత ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అర్జున్ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. 

పేస్ బౌలర్ అయిన అర్జున్ ముఖ్యంగా ఫిట్ నెస్ పై దృష్టి సారించాడు. ఈ క్రమంలో సిక్స్ ప్యాక్ బాడీని బిల్డప్ చేశాడు. షర్ట్ లెస్ లో తన సిక్స్ పాక్ యాబ్స్ ను చూపిస్తూ దిగిన మిర్రర్ సెల్ఫీ ఫొటోను అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిట్ నెస్ పట్ల అర్జున్ కు ఉన్న కమిట్ మెంట్ పై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

More Telugu News