Telangana: తెలంగాణలో వరద బాధిత జిల్లాలకు ప్రత్యేక అధికారులు!

  • తెలంగాణలో బీభత్సం సృష్టిస్తున్న వానలు
  • పలు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం
  • ములుగు, భూపాలపల్లికి, నిర్మల్‌, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్‌ జిల్లాలకు ప్రత్యేక ఆధికారులు
Special officers for flood affected districts in Telangana

ఎడతెరిపిలేని వానలు తెలంగాణలో బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదవుతోంది. వరంగల్ నగరం నీట మునిగింది. కొన్ని ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇంకొన్ని రోజులు వానలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వరద బాధిత జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్‌లను సీఎస్‌ శాంతికుమారి నియమించారు. ములుగు జిల్లా ప్రత్యేక అధికారిగా కృష్ణ ఆదిత్య, భూపాలపల్లికి పి.గౌతమ్‌, నిర్మల్‌కు ముషారఫ్‌ అలీ, మంచిర్యాలకు భారతి హోలికేరి, పెద్దపల్లి జిల్లాకు సంగీత సత్యనారాయణ, ఆసిఫాబాద్‌ జిల్లాకు హన్మంతరావును నియమిస్తూ ఉత్తర్వులు చేశారు. వీరంతా ఆయా జిల్లాల్లో వరద పరిస్థితులను పర్యవేక్షించనున్నారు.

More Telugu News