usa: గత 22 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వడ్డీ రేట్లను పెంచిన అమెరికా ఫెడ్ రిజర్వ్

  • వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర పెంచిన ఫెడ్ రిజర్వ్
  • 5.50 శాతానికి పెరిగిన ఫెడ్ ఫండ్స్ రేట్
  • ఈ ఏడాది మరోసారి పెంపు తప్పదంటున్న ఫెడ్ అధికారులు
Fed raises interest rates to highest in 22 years

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో ప్రస్తుతం 5.25 శాతంగా ఉన్న ఫెడరల్ ఫండ్స్ రేట్ 5.50 శాతానికి చేరింది. 2001 నుంచి అంటే గత 22 ఏళ్లలో వడ్డీ రేటు ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు 2022 నుంచి అమెరికా ఫెడ్ చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా 2022 మార్చి నుంచి ఇప్పటి వరకు రేట్లను 11వ సారి పెంచింది. 

ఇక ఈ ఏడాది వడ్డీ రేట్లను మరోసారి కూడా పెంచాల్సి రావచ్చని ఫెడ్ రిజర్వ్ అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతుండటం అమెరికా వ్యాపారవర్గాలను, వినియోగదారులను ప్రోత్సహించేలా ఉంది. మరోవైపు, ఫెడ్ రిజర్వ్ మాత్రం మరో అంచనాతో ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతోందని... అందుకే మరోసారి వడ్డీ రేట్ల పెంపు తప్పదని ఫెడ్ అధికారులు చెపుతున్నారు.

More Telugu News