Telangana: సాయం కోసం మోరంచ గ్రామస్థుల ఆర్తనాదాలు.. బాధితుడు పంపిన వీడియో ఇదిగో!

Moranchapalli village submerged due to flooding of nearby streams
  • జల దిగ్బంధంలో మోరంచపల్లి గ్రామం
  • ఇళ్ల పైకప్పుల మీదికి గ్రామస్థులు
  • రక్షించాలంటూ అధికారులకు ఫోన్లు
  • చెట్టు పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్న యువకులు
జయశంకర్‌ జిల్లా భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. మోరంచ వాగు ఉప్పొంగడంతో సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇంటి స్లాబ్‌ల పైకి ఎక్కారు. తమ పశువులను సైతం డాబాలపైకి ఎక్కించి కాపాడుకుంటున్నారు. ఇప్పటికే వరదల్లో పలువురు కొట్టుకుపోయారని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నామని గ్రామస్థులు వాపోతున్నారు. 

తమను కాపాడాలంటూ అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. ఓ లారీ వరద నీటిలో చిక్కుకుంది. లారీ పెకి ఎక్కిన డ్రైవర్ సాయం కోసం వేడుకుంటున్నాడు. పక్కనే ఓ చెట్టు పైకెక్కి ఇద్దరు గ్రామస్థులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. గ్రామంలో పరిస్థితిపై ఓ వ్యక్తి వీడియో తీసి తమను కాపాడాలంటూ అధికారులకు పంపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Telangana
Moranchapalli
floods
village submerged

More Telugu News