Hyderabad: హైదరాబాద్ లో కుండపోత వర్షమే.. అతి భారీ వర్ష హెచ్చరిక

  • నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
  • ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం
  • కొన్ని సార్లు అత్యంత వేగంగా జల్లులు కురుస్తాయని హెచ్చరిక
Hyderabad Weather

హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మరోవైపు ఈరోజు కూడా హైదరాబాద్ తో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని సార్లు అత్యంత వేగంగా జల్లులు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈరోజు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుంచి 21 డిగ్రీల మధ్య ఉంటాయని చెప్పింది. ఉపరితల గాలులు గంటకు 10 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది.   

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పలుచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తవచ్చని చెప్పింది. విద్యుత్, నీటి సరఫరాలకు కూడా అంతరాయం ఏర్పడవచ్చని తెలిపింది. పలుచోట్ల డ్రైనేజీ సమస్యలు తలెత్తవచ్చని పేర్కొంది.

More Telugu News