UNESCO: ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లల్లో మొబైల్ ఫోన్లను నిషేధించాలి: యూనెస్కో

  • ఆధునిక సాంకేతికతతో మనుషుల మధ్య సంబంధాలను భర్తీ చేయవద్దని సూచన
  • టెక్నాలజీ అతివినియోగంతో విద్యార్థుల సామర్థ్యాలు కుంటుపడుతున్నాయని వ్యాఖ్య
  • ప్రతి ఆవిష్కరణ అభివృద్ధిగా భావించరాదని హెచ్చరిక
Unesco suggests worldwide ban on mobile phones in schools

ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాలని యూనెస్కో తాజాగా సూచించింది. మనుషుల మధ్య సంబంధాలను పక్కనపెట్టి ఆ స్థానాన్ని డిజిటల్ టెక్నాలజీతో భర్తీ చేయకూడదని అభిప్రాయపడింది. మనుషులకు డిజిటల్ టెక్నాలజీ కేవలం ఓ సహాయకారిగా ఉండాలని అభిప్రాయపడింది. 

మొబైల్ ఫోన్లు అతిగా వాడటంతో విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతోందని వెల్లడించింది. పిల్లల మానసిక సమతౌల్యం దెబ్బతింటోందని చెప్పింది. సాంకేతిక రంగంలోని ప్రతి ఆవిష్కరణ అభివృద్ధిగా భావించకూడదని వివరించింది. కొత్త సాంకేతికతను గుడ్డిగా విద్యారంగంలో ప్రవేశపెట్టకూడదని హెచ్చరించింది. కాగా, ఇప్పటికే పలు దేశాల్లో ప్రభుత్వాలు స్కూళ్లల్లో మొబైల్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల వినియోగంపై నిషేధం విధించాయి.

More Telugu News