Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలికల మిస్సింగ్ వివరాలు వెల్లడించిన కేంద్రం

  • 2019 నుండి 2021 వరకు 22,278 మంది మహిళలు మిస్సింగ్
  • ఈ మూడేళ్ల కాలంలో 7928 మంది బాలికలు మిస్సింగ్
  • తెలంగాణలోను మిస్సింగ్ వివరాలు వెల్లడించిన కేంద్రం
Centre on Missing woman and girsl cases in AP and Telangana

తెలుగు రాష్ట్రాలలో మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర హోంశాఖ బుధవారం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలలో గత మూడేళ్లలో 72,767 మంది అదృశ్యమైనట్లు పార్లమెంటుకు నివేదించింది. ఇందులో 15,994 మంది బాలికలు, 56,773 మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మహిళల మిస్సింగ్ కేసులు పెరుగుతున్నట్లు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2019 నుండి 2021 మధ్య 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలిపారు. 2019లో 2,186 మంది బాలికలు, 6,252 మంది మహిళలు, 2020లో 3,374 మంది బాలికలు, 7,057 మంది మహిళలు, 2021లో 3,358 మంది బాలికలు, 8,869 మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలిపింది.

తెలంగాణ విషయానికి వస్తే అదే మూడేళ్ల కాలంలో 8,066 మంది బాలికలు, 34,495 మంది బాలికలు మిస్సింగ్ అయినట్లు తెలిపింది. 2019లో 2,849 మంది బాలికలు, 10,744 మంది మహిళలు, 2020లో 2,232 మంది బాలికలు, 10,917 మంది మహిళలు, 2021లో 2,994 మంది బాలికలు, 12,834 మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలిపింది.

More Telugu News