Rajanikanth: 'జైలర్' నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్!

  • 'జైలర్' పై పెరుగుతున్న అంచనాలు 
  • ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తున్న భారీ తారాగణం 
  • హైలైట్ గా నిలవనున్న అనిరుధ్ సంగీతం 
  • ఆగస్టు 10వ తేదీన సినిమా విడుదల
Jailer lyrical song released

రజనీకాంత్ కథానాయకుడిగా 'జైలర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతోంది. ఒక జైలర్ చుట్టూ .. జైలుతో ముడిపడిన అతని ఎమోషన్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఫస్టులుక్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా నుంచి ఓ సాంగును వదిలారు. 

'రా .. దాచుంచారా పరువాలన్నీ .. రాబరీకి రావే రావే, రా .. అందిస్తారా అందాలన్నీ .. ఎప్పటికీ నీవే నీవే,  రావు .. నువ్వు కావాలయ్యా .. '  అంటూ ఈ రొమాంటిక్ సాంగ్ సాగుతోంది.  రజనీ .. తమన్నా బృందంపై ఈ పాటను ప్రత్యేకమైన సెట్ లో కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన డాన్స్ ఆకట్టుకునేలా ఉంది.

అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటకి సాయికిరణ్ సాహిత్యాన్ని అందించగా, సింధుజా శ్రీనివాసన్ ఆలపించారు. ఈ పాటలో రజనీ మరింత స్టైల్ గా కనిపిస్తున్నారు. థియేటర్లో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలానే ఈ పాట ఉంది. భారీతారాగణంతో రూపొందిన ఈ సినిమాను, ఆగస్టు 10వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News