Siddhu Jonnalagadda: 'టిల్లు స్క్వైర్' నుంచి 'టిక్కెట్టే కొనకుండా' ఫుల్ సాంగ్ రిలీజ్!

  • క్రితం ఏడాది విడుదలైన 'డీజే టిల్లు'
  • యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన కంటెంట్ 
  •  చకచకా జరుగుతున్న సీక్వెల్ పనులు 
  • సాంగ్స్ పరంగా మరింత కేర్ తీసుకున్న టీమ్
Tillu Square lyrical song released

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా చేసిన 'డీజే టిల్లు'ను యూత్ ఇంకా మరిచిపోలేదు. క్రితం ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ఈ సినిమా, భారీ వసూళ్లను నమోదు చేసింది. అలాంటి ఆ సినిమాకి సీక్వెల్ గా 'టిల్లు స్క్వైర్' రూపొందుతోంది. నాగవంశీ - సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి, మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

తాజాగా ఈ సినిమా నుంచి 'టిక్కెట్టే కొనకుండా .. ' అనే ఫుల్ సాంగును రిలీజ్ చేశారు. 'టిక్కెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా .. సిట్టి నీది సినుగుతుందేమో సూడరబుల్లోడా' అంటూ ఈ పాట సాగుతోంది. రామ్ మిర్యాల సంగీతాన్ని సమకూర్చడమే కాకుండా, ఆయనే స్వయంగా ఆలాపించిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు.

 ఈ సినిమాలో సిద్ధూ జోడీగా అనుపమ పరమేశ్వరన్ అలరించనుంది. 'డీజే టిల్లు' సినిమాను చాలావరకూ ఆ సినిమా టైటిల్ సాంగ్ నిలబెట్టేసింది. అందువలన సంగీతం పరంగా సీక్వెల్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా చెబుతున్నారు. సీక్వెల్ పై యూత్ లో ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి.

More Telugu News