Health: పరగడుపున పండ్లు తింటే కలిగే ప్రయోజనాలివే..!

  • జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయంటున్న వైద్యులు
  • రక్తపోటును నియంత్రించుకోవచ్చని వెల్లడి
  • అధిక బరువును వదిలించుకోవచ్చని సూచన
Health benefits of eating fruits on an empty stomach

ఆరోగ్యానికి పండ్లకు మధ్య సంబంధం గురించి అందరికీ తెలిసిందే.. అయితే, ఉదయాన్నే పండ్లను తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి కావాల్సిన పోషకాలను పండ్లు అందిస్తాయని ఆయుర్వేద వైద్యులు కూడా చెబుతున్నారు. ఖాళీ కడుపుతో పండ్లు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుందని, తద్వారా మలబద్ధకానికి చెక్ పెట్టొచ్చని అంటున్నారు. ఎముకలు, మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని, చర్మ సమస్యలను దూరం పెట్టవచ్చని వైద్యులు వివరించారు.

ఉదయం పూట వ్యాయామానికి ముందు, తర్వాత రెగ్యులర్ కార్బోహైడ్రేట్లు ఉండే పండ్లు తీసుకోవాలని, సాయంకాలం వేళ కొవ్వు, ప్రొటీన్ తక్కువ ఉండే పిండి పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ అద్భుతంగా పనిచేస్తుంది. పండ్లలోని పైబర్ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.

ఉదయాన్నే తాజా పండ్లు తీసుకోవడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. పండ్లలో ఉండే నేచురల్ షుగర్, పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడతాయని వివరించారు. చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ యవ్వనంగా కనిపిస్తారని అన్నారు. అంతేకాదు.. సీజనల్ గా లభించే పండ్లను నిత్యం తీసుకోవడం ద్వారా అధిక బరువును వదిలించుకోవచ్చని, వేగంగా బరువు తగ్గేందుకు పండ్లు ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

More Telugu News