Harman Preet Kaur: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ పై రెండు మ్యాచ్ ల నిషేధం

  • ఇటీవల బంగ్లాదేశ్ తో భారత మహిళల జట్టు వన్డే సిరీస్
  • మూడో వన్డేలో అంపైర్ పట్ల హర్మన్ ప్రీత్ కౌర్ ఆగ్రహం
  • అవుట్ ఇవ్వడం పట్ల కోపంతో వికెట్లను తన్నిన భారత కెప్టెన్
  • హర్మన్ ప్రీత్ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ
ICC imposes two match ban on Team India women team captain Harman Preet Kaur

ఇటీవల బంగ్లాదేశ్ మహిళల జట్టుతో టీమిండియా మహిళలు వన్డే సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. అయితే, మూడో వన్డేలో అంపైరింగ్ పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అందుకు మూల్యం చెల్లించుకుంది. టీమిండియా ఆడే తదుపరి రెండు మ్యాచ్ లకు గాను హర్మన్ ప్రీత్ ను ఐసీసీ సస్పెండ్ చేసింది. 

హర్మన్ ప్రీత్ ఐసీసీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినట్టు తేలడంతో సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఆమె మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడమే కాకుండా, 3 డీమెరిట్ పాయింట్లను కూడా కేటాయించారు. సస్పెన్షన్ నేపథ్యంలో, సెప్టెంబరులో చైనాలో జరిగే ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్ లో తొలి రెండు మ్యాచ్ లకు హర్మన్ ప్రీత్ దూరం కానుంది. 

బంగ్లాదేశ్ తో ఇటీవల జరిగిన మూడో వన్డేలో హర్మన్ ప్రీత్ 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు అంపైర్ అవుట్ ఇవ్వడం వివాదాస్పదమైంది. అంపైర్ నిర్ణయం పట్ల రగిలిపోయిన హర్మన్ ప్రీత్ కోపంతో వికెట్లను తన్నింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా, హర్మన్ పీత్ అంపైరింగ్ ను ఉద్దేశించి విమర్శలు చేసింది. ఇకపై ఇలాంటి అంపైరింగ్ ను ఎలా ఎదుర్కోవాలో సిద్ధమై వస్తానంటూ వ్యంగ్యం ప్రదర్శించింది.

More Telugu News