Chandrababu: ఎగిరెగిరి పడుతున్నారు... మీకు తగిన చోటు చూపిస్తా: చంద్రబాబు

Chandrababu warns YCP leaders
  • వైసీపీ నేతలకు చంద్రబాబు ఘాటు హెచ్చరికలు
  • మీకు ఎక్స్ పైరీ డేటు దగ్గరపడింది అంటూ వ్యాఖ్యలు
  • మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతామని వార్నింగ్ 
టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

"వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నా... మీరు తీవ్ర అసహనంలో ఉన్నారు... మీరు తిడతారని నాకు తెలుసు.... మీరు ఓడిపోతారని మీకు కూడా తెలుసు. మీకు ఎక్స్ పైరీ డేటు దగ్గరపడింది. అందుకేనేమో... ఎగిరెగిరి పడుతున్నారు. అంత ఎగిరి పడొద్దండీ... మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. మీరేం భయపడనక్కర్లా... మీకు తగిన చోటు చూపించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. 

కేసులు పెడితే భయపడతారనుకునో, రౌడీయిజం చేస్తే భయపడతారనో, ఓట్లను తారుమారు చేయొచ్చనో అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోటి ఉండదు. దొంగ ఓట్లను చేర్చే వారికి చెబుతున్నా... ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. అన్నీ కంట్రోల్ చేస్తాం. 

నాకు కావాల్సింది ప్రజల నుంచి సహకారం. ప్రజల్లో చైతన్యం రావాల్సి ఉంది. ప్రజల్లో చైతన్యం కోసం, భావితరాల వారి భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ, సంక్షేమాన్ని అందించిన పార్టీ, తెలుగుజాతిని ప్రపంచపటంలో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News