IITH Student: విశాఖ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఐఐటీహెచ్ విద్యార్థి

IITH Student Karthik Body Found In Visakha Seashore
  • ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ సెకండియర్ చదువుతున్న కార్తీక్
  • ఈ నెల 17న క్యాంపస్ నుంచి అదృశ్యం
  • సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వైజాగ్ వెళ్లినట్టు గుర్తింపు
  • ఈ ఉదయం సముద్రం ఒడ్డున మృతదేహం గుర్తింపు
ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) విద్యార్థి కార్తీక్ అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. నగరం నుంచి విశాఖపట్టణం చేరుకున్న విద్యార్థి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ ఐఐటీహెచ్‌లో బీటెక్ (మెకానికల్) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 17న క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. అధికారుల నుంచి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

రంగంలోకి దిగిన పోలీసులు కార్తీక్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వైజాగ్ వెళ్లినట్టు గుర్తించారు. అతడి కోసం పోలీసులు, తల్లిదండ్రులు విస్తృతంగా గాలించారు. చివరికి ఈ ఉదయం సముద్రం ఒడ్డున కార్తీక్ మృతదేహం లభ్యమైంది. సముద్రంలోకి దూకి అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. కార్తీక్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
IITH Student
Hyderabad
Visakhapatnam
Suicide

More Telugu News