Amit Shah: ఈ నెల 29న హైదరాబాద్‌కు అమిత్ షా

  • పార్టీలోని వివిధ విభాగాల నేతలతో సమావేశం
  • సంస్థాగత అంశాలపై సమీక్ష
  • కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి హైదరాబాద్ కు అమిత్ షా
Amit Shah hyderabad visit on 29 july

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. పార్టీలోని వివిధ విభాగాల నేతలతో ఆయన సమావేశం కానున్నారు. సంస్థాగత అంశాలపై సమీక్షించనున్నారు. 

కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు. ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో మిగతా ప్రధాన పార్టీల బాటలోనే బీజేపీ పెద్దలు కూడా ఎన్నికలపై దృష్టి సారించారు. 

మరోవైపు, త్వరలో బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉండనున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో అమిత్ షా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

More Telugu News