Telangana: శుభవార్త చెప్పిన కేసీఆర్... ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో వీఆర్ఏల విలీనం

Good News for VRAs in Telangana
  • వీఆర్ఏలకు పే స్కేల్ అందిస్తూ.. వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలని జీవో
  • జీవో కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు అందించిన కేసీఆర్
  • రెవెన్యూ శాఖలో 20 వేల మందికి పైగా వీఆర్ఏలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో కాపీని ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏ జేఏసీ నేతలకు అందించారు. వీఆర్ఏలకు పే స్కేల్ అందిస్తూ.. వీరిని వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలని జీవో జారీ చేసింది. తద్వారా వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి, వీఆర్ఏలుగా పని చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

రెవెన్యూ శాఖలో 20వేల మందికి పైగా ఉన్న వీఆర్ఏలను సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నారు. రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ అంశాలపై ఆదివారం సచివాలయంలో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలోనే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Telangana
KCR
vra
government

More Telugu News