Pooja Hegde: రవితేజ జోడీగా మెరవనున్న పూజ హెగ్డే!

Pooja Hegde in Gopichand Malineni Movie
  • వరుస ఫ్లాపులతో ఉన్న పూజ హెగ్డే 
  • కాస్త డీలాపడిన కెరియర్ 
  • గోపీచంద్ మలినేని సినిమాలో చేయనుందనే టాక్ 
  • ఆయన రవితేజతో చేస్తున్న నాలుగో సినిమా ఇది
పూజ హెగ్డే నిన్నమొన్నటివరకూ టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో కనిపిస్తూ వచ్చింది. ఆ తరువాత తమిళంలో ... హిందీలో తన జోరు చూపించే దిశగా అడుగులు వేస్తూ వెళ్లింది. అయితే అంతకుముందు వరుస విజయాలను అందుకుంటూ వచ్చిన ఆమె, ఆ తరువాత నుంచి అదేస్థాయిలో పరాజయాలను అందుకుంటూ వెళ్లవలసి వచ్చింది.

తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో స్టార్ హీరోలతో ఆమె చేసిన సినిమాలు భారీ పరాజయాలను చూశాయి. పాన్ ఇండియా సినిమాలు వరుసగా దెబ్బతినడంతో, ఆమె కెరియర్ అయోమయంలో పడే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాజెకులకు సంబంధించి ఆమె పేరు వినిపిస్తోంది .. అలాగే మరికొన్ని ప్రాజెక్టుల నుంచి తప్పుకుందనే టాక్ నడుస్తోంది. 

ఈ నేపథ్యంలో రవితేజ సరసన నాయికగా ఆమె ఒక సినిమాలో చేయనుందని తెలుస్తోంది. రవితేజతో కలిసి హ్యాట్రిక్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని మళ్లీ అతనితోనే మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. 

Pooja Hegde
Raviteja
Gopichand Malineni

More Telugu News