Varun Tej: హాలీవుడ్ స్థాయి యాక్షన్ దృశ్యాలతో 'గాండీవధారి అర్జున' .. టీజర్ రిలీజ్!

  • 'గాండీవధారి అర్జున'గా వరుణ్ తేజ్ 
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • హైలైట్ గా నిలవనున్న మిక్కీ జె మేయర్ సంగీతం
  • దాదాపు ఇతర దేశాల్లోనే జరిగిన షూటింగ్ 
  • ఆగస్టు 25వ తేదీన సినిమా విడుదల
Gandeevadhari Arjuna Movie Pre Teaser Released

వరుణ్ తేజ్ హీరోగా 'గాండీవధారి అర్జున' సినిమా రూపొందింది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ - బాపినీడు నిర్మించిన ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాలో 'అర్జున్ వర్మ' అనే పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా సాక్షి వైద్య అలరించనుంది. 'ఏజెంట్' తరువాత ఆమె చేసిన సినిమా ఇది. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ పై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేపుతోంది. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ .. వాళ్ల పాత్రలు అర్థమయ్యేలా చేస్తూ ఈ టీజర్ ను వదిలారు. ఫారిన్ లో చిత్రీకరించిన ఫైట్స్ ... ఛేజింగ్స్ .. ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలవనున్నాయి.   

ప్రవీణ్ సత్తారు పేరు యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తుంది. స్టైలీష్ మేకింగ్ తో ఆయన యాక్షన్ సినిమాలు ఆకట్టుకుంటూ ఉంటాయి. మిక్కీ జె మేయర్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరికాతో పాటు ఐరోపా దేశాలలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, ఆగస్టు 25వ తేదీన విడుదల కానుంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాల స్థాయిలో నిర్మాణ విలువలు కనిపిస్తూ ఉండటం విశేషం.

More Telugu News