Jagan: అమరావతిలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలకు నేడు శంకుస్థాపన చేయనున్న జగన్

  • మే 26న పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం
  • 1,402 ఎకరాల్లో 25 లేఅవుట్లలో 50,793 ఇళ్ల నిర్మాణం
  • రూ. 1,371.41 కోట్ల ఖరీదైన భూమిలో పేదలకు ఇళ్లు
Jagan to lay foundation stone for houses in Amaravati

మరో భారీ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. అమరావతిలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏలో ఈ రోజు భూమి పూజను నిర్వహించనున్నారు. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో 25 లేఅవుట్ లలో 50,793 మందికి మే 26న ఇళ్ల పట్టాలను అందించిన సంగతి తెలిసిందే. మొత్తం రూ. 1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు పంపిణీ చేశారు. ఈ భూమిలో ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలను చేపట్టబోతున్నారు.

More Telugu News